FIRE ACCIDENT AT FOREST: వేసవి వచ్చిదంటే చాలు ఏజెన్సీలోని ప్రజలు భయంగా కాలం గడపాల్సిన పరిస్థితి నెలకొంది. ఎటు నుంచి కార్చిచ్చు మొదలై తమ ప్రాంతాలను ఆహుతి చేస్తుందోనని వారు వణికిపోతున్నారు.
FIRE ACCIDENT AT FOREST: అటవీప్రాంతంలో కార్చిచ్చు.. భయాందోళనలో ప్రజలు - వరంగల్ తాజా నేర వార్తలు
FIRE ACCIDENT AT FOREST: ఇప్పుడిపుడే ఎండలు మండుతున్నాయి. వేసవి వచ్చిందంటే ఏజెన్సీలోని దట్టమైన అడవులు అగ్నికి ఆహుతి అవుతున్నాయి. వడగాల్పులకు మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఫలితంగా పెద్ద చెట్లు కార్చిచ్చుకు కాలిపోతున్నాయి. తద్వారా అరుదుగా లభించే ఔషధ మొక్కలు కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
అటవీ ప్రాంతంలో చేలరేగిన మంటలు
మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం గండిచెరువు సమీపంలో ఉన్న అడవిలో ఎగిసిపడుతున్న మంటలు అక్కడి స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. విస్తరిస్తున్న కార్చిచ్చు ఎగసిపడే మంటల వ్యాప్తితో నివాస ప్రాంతాలకు ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళనకు గురవుతున్నారు. మంటలను నివారించేందుకు అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తే.. తమకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని ఏజెన్సీ ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: పోడు రైతుపై అటవీ అధికారుల దాడి.. కార్యాలయానికి తీసుకెళ్లి.