Fire accident at chaderghat: హైదరాబాద్లోని చాదర్ఘాట్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చాదర్ఘాట్లోని మూసీ ఒడ్డున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 32 గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. మంటల ధాటికి గుడిసెల్లో ఉన్న సిలిండర్ పేలాయి. సిలిండర్లు పేలిన శబ్ధానికి భయపడి ప్రజలు పరుగులు తీశారు.
Fire accident at chaderghat: మూసీ ఒడ్డున భారీ అగ్నిప్రమాదం.. 32 గుడిసెలు దగ్ధం - chaderghat fire breaks out
16:43 December 31
Fire accident at chaderghat: మూసీ ఒడ్డున భారీ అగ్నిప్రమాదం.. 32 గుడిసెలు దగ్ధం
పోలీసులకు సమాచారం అందించగా.. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మొత్తం ఐదు అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పారు. అగ్నిప్రమాదంలో గుడిసెలు, అందులోని నిత్యావసరాలు, ఇతరవస్తులు కాలి బూడిదయ్యాయి. ఎంతమేర నష్టం వాటిల్లిందనేది అంచనావేయాల్సి ఉంది. ఎవ్వరికీ ఎలాంటి ప్రాణహాని జరగలేదు.
గుడిసెలు, నిత్యావసరాలు మొత్తం కళ్ల ముందే కాలిపోవటాన్ని చూసి.. అందులో ఉండే ప్రజలు లబోదిబోమన్నారు. తమ జీవితాలు రోడ్డున పడిపోయాయని గుండెలుబాదుకున్నారు. నిరాశ్రయులైన 60 మందికి ప్రభుత్వ పాఠశాలలో ఆశ్రయం కల్పించారు.
ఇదీ చూడండి: