Fire Accident in Hyderabad :హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట్ ప్రధాన రహదారిలోని... ఓ గిఫ్ట్ అండ్ టాయ్స్ దుకాణంలో ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
Fire Accident in Hyderabad : గిఫ్ట్ అండ్ టాయ్స్ షాపులో అగ్నిప్రమాదం - హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం
Fire Accident in Hyderabad :హైదరాబాద్ బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిజాంపేట ప్రధాన రహదారిలో గిఫ్ట్ అండ్ టాయ్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పారు. ఈ ప్రమాదంతో రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగి ఉంటుందని దుకాణం నిర్వాహుకులు అంచనా వేశారు.
Fire Accident in Hyderabad
ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేశారు. అగ్ని కీలలకు దుకాణంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. దాదాపు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లి ఉంటుందని దుకాణం నిర్వాహకులు అంచనా వేశారు. షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అగ్నిమాపక సిబ్బంది భావిస్తున్నారు.