Fire Accident in Jeedimetla జీడిమెట్లలో రియాక్టర్లు పేలి భారీ అగ్నిప్రమాదం - జీడిమెట్లలో అగ్నిప్రమాదం
11:10 August 22
జీడిమెట్ల రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం, ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శ్రీధర్ బయోటెక్ అనే రసాయన పరిశ్రమలో 5 రియాక్టర్లు ఒక్కసారిగా పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా 5 రియాక్టర్లు పేరి భారీ శబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భయంతో పరుగులు తీశారు.
ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో పరిశ్రమలో సిబ్బంది కూడా భయాందోళనకు గురయ్యారు. వెంటనే పరిశ్రమ నుంచి బయటకు పరుగులు తీశారు. కానీ ముగ్గురు మాత్రం ఈ ప్రమాదంలో గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 2 అగ్నిమాపక యంత్రాలతో మంటలు ఆర్పుతున్నారు. భారీ ఎత్తున పొగ అలుముకోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పొగ చుట్టుపక్కల వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది చర్యలు చేపట్టారు.