cash Theft: కారులో ఉన్న రూ.15 లక్షలతో రూపాయల నగదుతో డ్రైవర్ పరారయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్‌పల్లి పరిధిలో జరిగింది. అయితే పోలీసులు కేవలం ఆరుగంటల్లోనే ఈ కేసును చేధించారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి రూ.15 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
మహబూబ్‌నగర్ బూర్గులలోని జ్యోతి స్పిన్నింగ్ మిల్లో మేనేజర్‌గా పనిచేసే జగదీశ్వర్ జీడిమెట్లలో నివాసముంటున్నాడు. కాగా.. కంపెనీకి చెందిన 15 లక్షల రూపాయల నగదుతో గతంలో పరిచయమైన రాజుతో కలిసి క్యాబ్ జీడిమెట్ల నుంచి మహబూబ్‌నగర్‌కు బయల్దేరాడు. ఈ క్రమంలోనే మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బెంగళూర్ జాతీయ రహదారి బుద్వేల్ వద్దకు రాగానే మూత్రవిసర్జనకు వెళ్లేందుకు జగదీశ్వర్ కారు ఆపాడు.