FATHER SUICIDE WITH DAUGHTERS : ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి తాళలేక ఓ తండ్రి తీసుకున్న నిర్ణయం ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో కలకలం రేపింది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజవోలులోని వి.ఎల్. పురానికి చెందిన సత్యకుమార్ అనే వ్యక్తి.. తన ఇద్దరు కుమార్తెలు రిషిత, హిద్విలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య - తూర్పు గోదావరిలో విషాదం
FATHER SUICIDE : ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. భార్య శుభకార్యం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఇద్దరు కుమార్తెలను తీసుకుని సమీపంలోని చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
SUICIDE
చెరువు వద్ద ఆత్మహత్య లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తండ్రి, కుమార్తెల మరణంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. భార్య శుభకార్యం కోసం పుట్టింటికి వెళ్లిన సమయంలో ఈ దారుణానికి పాల్పడ్డాడు సత్యకుమార్. మృతదేహాల వద్ద కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాలను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
ఇవీ చదవండి: