తెలంగాణ

telangana

ETV Bharat / crime

Rape: విద్యాసంస్థలో పీడీగా చేస్తూ.. కూతురిపై వాంఛ తీర్చుకున్న తండ్రి - కృష్ణా జిల్లాలో ఐదేళ్ల కుమార్తెపై తండ్రి అత్యాచారం వార్తలు

తండ్రి ఏమి చేస్తున్నాడో తెలియని పసితనం ఆమెది. ఆ పసిదాన్ని చూసిన ఆ తండ్రికి మాత్రం కనీసం జాలి కలుగలేదు. కామంతో కళ్లు మూసుకుపోయాయి అతనికి. అభం శుభం తెలియని... ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి పైశాచికంగా ప్రవర్తించాడు. ఒక జాతీయ విద్యాసంస్థలో పీడీగా పనిచేస్తున్న అతను.. వావివరుసలు లేకుండా... కూతురిపై వాంఛ తీర్చుకున్నాడు. రెండున్నర నెలల కింద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

father-rapes-his-daughter
కన్న కూతురిపైనే అఘాయిత్యం

By

Published : Sep 9, 2021, 6:53 AM IST

Updated : Sep 9, 2021, 9:14 AM IST

ముక్కుపచ్చలారని చిన్నారి.. నిండా అయిదేళ్లు కూడా లేని కన్నబిడ్డపై కన్నేశాడో కసాయి తండ్రి. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు చిన్నారిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కూతురు ఆరోగ్యం బాగోకపోవడంతో గుర్తించిన తల్లి చిట్టి తల్లీ ఏమైందంటూ ఆరా తీశారు. వచ్చీ రాని మాటలతో తండ్రి చేసిన అఘాయిత్యాన్ని చెప్పడంతో ఆ తల్లి ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. దాదాపు రెండున్నర నెలల కిందట జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సభ్య సమాజం సిగ్గుపడేలా చేసినా ఈ అమానవీయ సంఘటన ఆంధ్రప్రదేశ్​లోని నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

వచ్చీ రాని మాటలతో బాధను తెలుపగా..

నున్న పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివాసం ఉండే దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త నగరంలోని ఒక జాతీయ విద్యాసంస్థలో పీడీగా పనిచేస్తున్నాడు. కొద్ది రోజులుగా పెద్ద కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లి ఆమెను వైద్యుడి వద్దకు ఈ ఏడాది జూన్‌ 21న తీసుకెళ్లారు. వైద్యుడు పరీక్షించి మూత్ర సంబంధమైన ఇన్‌ఫెక్షన్‌ సోకి ఉండవచ్చని భావించి మందు ఇచ్చి పంపించారు. మందు వాడినా కూతురు ఆరోగ్యం కుదుటపడలేదు. ఏమైందంటూ కూతురును ప్రశ్నించిందా తల్లి. వచ్చీ రాని మాటలతో కన్న తండ్రి చేసిన పనులు చెప్పడంతో ఆ కామాంధుడి చేష్టలు వెలుగులోకి వచ్చాయి.

తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులు

బిడ్డపై తీవ్రస్థాయిలో లైంగిక వేధింపులతో పాటు అత్యాచారానికి పాల్పడిన భర్తను ఆమె నిలదీశారు. పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అతడు ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ నెల 4న మళ్లీ ఇంటికి వచ్చి కూతురును తీసుకెళ్లిపోతుండగా చిన్నారి అమ్మమ్మ అడ్డుకున్నారు. కంట్రోల్‌రూంకు ఫోన్‌ చేయడంతో అతను అక్కడి నుంచి పారిపోయాడు. దీనిపై చిన్నారి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ దిశ పోలీసు స్టేషన్‌లో నిందితుడిపై ఐపీసీ 376ఏబీ సెక్షన్‌, పోక్సో చట్టం కింద ఈ నెల 6న కేసు నమోదు చేశారు. చిన్నారిని విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చేర్చి వైద్యపరీక్షలు చేశారు. నిందితుడిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. అతడిని న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు.

ఇదీ చదవండి:Brutal Incident: ప్రేమించి పెళ్లి చేసుకుందని.. ఓ తల్లి నిర్వాకం

Last Updated : Sep 9, 2021, 9:14 AM IST

ABOUT THE AUTHOR

...view details