పిడుగుపాటుకు తండ్రీ, కుమారుడు మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం మక్దుంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన మచ్చగోని కృష్ణ(36), కుమారుడు ప్రశాంత్(10)తో కలిసి సొంత పొలంలో పనికి వెళ్లారు. ఈదురు గాలులకు తోడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుండడం వల్ల పొలం గట్టున చింతచెట్టు కింద నిల్చున్నారు.
విషాదం: పిడుగుపాటుకు తండ్రీ, కొడుకు మృతి
తండ్రీ, కొడుకు పొలం పనికి వెళ్లారు. అంతలోనే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురుస్తుందని చింతచెట్టు కింద నిల్చున్నారు. అంతే ఒక్కసారిగా పడిన పిడుగుపాటుకు వారిద్దరూ కుప్పకూలారు. వారి పెంపుడు కుక్క కూడా వారి మరణంలో తోడుగా ఉంది. ఈ హృదయ విదారక ఘటన సంగారెడ్డి జిల్లా మక్దుంపల్లి గ్రామంలో జరిగింది.
Father and son died, thunderstrom in mukdumpalli, sangareddy
ఈ క్రమంలో భారీ శబ్దంతో పిడుగు పడటం వల్ల తండ్రీ, కుమారుడుతో పాటు వెంట ఉన్న కుక్క మృతి చెందింది. పిడుగుపాటు ప్రమాదంలో భర్త, కుమారుడిని కోల్పోయిన కృష్ణ భార్య.. కన్నీరు మున్నీరుగా విలపించింది. ఈ విషాదఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఘటనా స్థలాన్ని మునిపల్లె ఎస్ఐ మహేశ్వర్ రెడ్డి సందర్శించి పంచనామా నిర్వహించారు.
ఇదీ చూడండి: విద్యుత్ షాక్తో యువరైతు దుర్మరణం