Father and Daughter Cheating by Railway jobs: రైల్వే ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగించిన తండ్రీకుమారైను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా పీర్జాదిగూడలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి.. రైల్వేలో ఉద్యోగం చేస్తున్న దూరపు బంధువు గొల్లపల్లి నాగరాజు ఉద్యోగం పేరుతో ఆశజూపాడు. తన కుమార్తె రైల్వేలో జనరల్ మేనేజర్‌గా పని చేస్తోందని, ఆమెకు ఉన్నతాధికారులతో పరిచయం ఉందని నమ్మించాడు. రూ. 5 లక్షలు కడితే ఉద్యోగం వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చాడు. వారు చెప్పేది నిజమని నమ్మిన బాధితుడు.. రూ. 5 లక్షలు కట్టారు.
ఉద్యోగాల పేరుతో తండ్రీకుమార్తె ఎర.. రూ. 50 లక్షలు మోసం - father and daughter cheating by railway jobs
Father and Daughter Cheating by Railway jobs: నిరుద్యోగుల ఆశలను పెట్టుబడిగా పెట్టి రూ. లక్షల్లో మోసాలకు పాల్పడుతున్నారు ఓ తండ్రీకూతురు. కుమార్తెకు విలువలకు నేర్పిస్తూ.. సన్మార్గంలో నడిచేచేలా చూడాల్సిన ఆ తండ్రే.. ఆమెను తప్పుడు మార్గంలో నెట్టేశాడు. ఉద్యోగాల ఎర వేసి అందినకాడికి దోచుకుంటున్నారు. ఎట్టకేలకు ఓ బాధితుడి ఫిర్యాదుతో వారి మోసం బట్టబయలైంది. చివరకు కటకటాలపాలయ్యారు.
కొన్ని రోజుల తర్వాత ఉద్యోగం వచ్చిందని చెప్పి.. బాధితుడికి నాగరాజు, అతని కుమార్తె నకిలీ నియామకం పత్రం ఇచ్చారు. ఆ విషయం గమనించని బాధితుడు.. దానిని తీసుకుని సికింద్రాబాద్‌లోని రైల్ నిలయానికి వెళ్లారు. అక్కడి అధికారులు పత్రాన్ని పరిశీలించి నకిలీగా గుర్తించారు. వెంటనే మేడిపల్లి పోలీసు స్టేషన్లో తండ్రి, కుమార్తెపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తండ్రీకుమార్తెను అదుపులోకి తీసుకున్నారు. సుమారు 20 మంది నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వరకూ.. నిందితులు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. దీంతో వారిద్దరినీ రిమాండ్‌కు తరలించారు.
ఇదీ చదవండి:జూబ్లీహిల్స్‌లో కారు బీభత్సం.. పసికందు మృతి.. వాహనంపై ఎమ్మెల్యే స్టిక్కర్.!