Subbakkapally Mirchi Farmer suicide : ఆరుగాలం కష్టపడి పనిచేసిన ఆ అన్నదాతకు చావే శరణ్యమైంది. ఎండనకా... వాననకా శ్రమిస్తే... ప్రతిఫలంగా పురుగుల మందే మిగిలింది. ఏటా అప్పులే మిగులుతున్నా... వ్యవసాయం మీద మక్కువతో... మళ్లీ మళ్లీ అప్పులు తెచ్చి... పంట పండించారు ఆ రైతు. కానీ వాతావరణం సరిగా లేక... మద్దతు ధర దక్కకా అప్పులే మిగిలాయి. చివరకు చేసేది లేక మిరప చేను వద్దే... పురుగుమందు తాగి ఉసురు తీసుకున్నారు ఆ అన్నదాత.
Subbakkapally Mirchi Farmer suicide : పురుగుల మందు తాగి మిరప రైతు ఆత్మహత్య - telangana latest updates
16:30 December 15
పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
Farmer suicide: జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామంలో మిరప చేను వద్దనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చేసుకున్నారు. గ్రామానికి చెందిన రైతు రవీందర్ రావు(52) తనకున్న 2.15 ఎకరాల్లో మిర్చి పంటను సాగుచేశారు. మొదట్లో బాగానే ఉన్నా ఇటీవల వాతావరణ మార్పుల కారణంగా... పంటకు వివిధ రకాల తెగుళ్లు సోకాయి. వాటిని నివారించేందుకు రూ.2లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా తెగుళ్లు అదుపు కాలేదు.
అప్పులో ఊబిలో చిక్కుకొని..
మరోవైపు గతేడాది ఐదెకరాలు కౌలుకు తీసుకొని మిర్చిపంట వేసి నష్టపోయారు. ఫలితంగా ఇప్పటివరకు దాదాపు రూ.15లక్షల అప్పు అయింది. అప్పుల బాధతో మనస్తాపానికి గురైన రవీందర్ రావు... బుధవారం ఉదయం మిర్చిపంట వద్దనే పురుగులమందుతాగి తనువు చాలించారు. మృతుడికి భార్య సులోచన, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వినయ్ కుమార్ తెలిపారు.
స్థానికంగా విషాదఛాయలు
నిన్న, మొన్నటిదాకా తమ మధ్యే తిరిగిన రవీందర్ రావు ఆత్మహత్య చేసుకోవడం ఆ గ్రామంలో విషాదం నింపింది. ఎంతో ధైర్యంగా ఉండే ఆ రైతు చివరకు పురుగుల మందు తాగడం అక్కడి కర్షకులతో కన్నీళ్లు పెట్టించింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపొలంలోనే ఉసురుతీసుకోవడంతో స్థానికులను కలచివేసింది.
ఇదీ చదవండి:Chili crop farmer suicide: ఆశించిన దిగుబడి రాదని మనస్తాపం చెంది రైతు ఆత్మహత్య