పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన ఓ రైతు విద్యుదాఘాతంతో మృతిచెందాడు. ఈ ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం శానయిపల్లి గ్రామంలో జరిగింది.
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన మెదక్ జిల్లా పాపన్నపేట మండలం శానయిపల్లి గ్రామంలో జరిగింది.
జిల్లాలోని పాపన్నపేట గ్రామానికి చెందిన నర్సింహులు (41) వరి పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లాడు. స్టార్టర్కు విద్యుత్ సరఫరా కాకపోవడంతో పక్కనే ఉన్న విద్యుత్ నియంత్రిక వద్ద మరమ్మతు చేస్తున్నాడు. ఈ క్రమంలో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎంతసేపటికీ అతడు ఇంటికి రాకపోవడంతో పొలం వద్దకు వెళ్లి చూడగా అతని మృతదేహం కనిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు- 8మంది మృతి