మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పంతులుతండా శివారులో విద్యుదాఘాతంలో రైతు మృతిచెందాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రవి ప్రాణాలు కోల్పోయాడంటూ... సబ్‌స్టేషన్ ముందు మృతదేహంతో తండావాసులు బైఠాయించారు. బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి.. సబ్‌స్టేషన్ ముందు బంధువుల ఆందోళన - Mahabubabad district latest news
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పంతులుతండా శివారులో విద్యుదాఘాతంతో రైతు మృతిచెందాడు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యంతోనే రవి ప్రాణాలు కోల్పోయాడంటూ... తండావాసులు ఆందోళనకు దిగారు. వారిపై తగిన చర్యలు తీసుకుని మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
ఆ సమయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకుంటామన్న హామీ ఇచ్చి... ఆందోళన విరమించారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఓదార్చారు.
ఇదీ చదవండి: CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ