తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యుదాఘాతంతో రైతు మృతి - కరెంట్​ షాక్​తో రైతు మృతి​

కుమార్తె కోరిక మేరకు కాయలు కోసేందుకు మామిడి చెట్టెక్కిన ఓ రైతు.. విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.

farmer died with electric shock
farmer died with electric shock

By

Published : Apr 22, 2021, 10:16 PM IST

విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలో జరిగింది. పొల్కెపాడ్ గ్రామానికి చెందిన హనుమంతు.. కుమార్తెతో కలిసి పొలానికి వెళ్లాడు. చిన్నారి కోరిక మేరకు మామిడి చెట్టుపై కాయలు కోసేందుకు ప్రయత్నించి కరెంట్​ షాక్​కు గురయ్యాడు.

ప్రమాదానికి గురైన తండ్రిని చూసి పక్కనే ఉన్న కుమార్తె కేకలు వేయడంతో.. చుట్టుపక్కల రైతులంతా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న హనుమంతును జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే.. బాధితుడు అప్పటికే ప్రాణాలు విడిచినట్లు వైద్యులు నిర్ధరించారు.
మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ఇదీ చదవండి:అమానవీయం: బిక్కనూర్​లో కుల బహిష్కరణ

ABOUT THE AUTHOR

...view details