Farmer died: భూ తగాదాల్లో ఇద్దరు రైతుల మధ్య జరిగిన ఘర్షణ.. ఒకరిని బలితీసుకుంది. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం గట్టు సింగారం రెవెన్యూ పరిధిలోని గన్యా తండా, నేలపట్టు గ్రామాలకు చెందిన ఇద్దరు రైతుల మధ్య గత కొన్ని రోజులుగా భూ వివాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో గన్యా తండాలోని వివాద భూమి వద్దకు వచ్చిన ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనలో తండాకు చెందిన రైతు రామారావు(80).. మృతి చెందారు.
Farmer died: భూ తగాదాల్లో ఇద్దరు రైతుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి - farmer died in gamya thanda
Farmer died: భూ తగాదాల్లో ఓ రైతు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా గట్టు సింగారం రెవెన్యూ పరిధిలోని గన్యా తండాలో జరిగింది. ప్రత్యర్థుల దాడి వల్లే తన తండ్రి చనిపోయారని మృతుని కుమారుడు ఆరోపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భూవివాదంలో రైతు మృతి
తన తండ్రి చావుకు కారణం నేలపట్టుకు చెందిన రైతేనని మృతుడు కుమారుడు, బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలంలో మృతదేహాన్ని చూసి రోదించారు. స్థానికుల సమాచారంతో అక్కడికిి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:ఉరివేసుకుని కుటుంబం ఆత్మహత్య.. అప్పుల బాధలే కారణమా!
Last Updated : Feb 7, 2022, 8:40 PM IST