తెలంగాణ

telangana

ETV Bharat / crime

విద్యుదాఘాతంతో పొలంలోనే రైతు మృతి

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తన వ్యవసాయ బావి వద్ద మోటారు పని చేయకపోవడంతో... స్టాటర్​ను చెక్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

By

Published : Mar 25, 2021, 12:14 PM IST

Updated : Mar 25, 2021, 12:36 PM IST

farmer died due to electric shock in Medak district
విద్యుదాఘాతంలో పొలంలోనే రైతు మృతి

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగుడ భూపతిపూర్​లోని ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మొగులయ్య(33) తన వ్యవసాయ బావి వద్ద గల మోటారు పని చేయకపోవడంతో... గాండ్ల సుధాకర్​ను తీసుకొని పొలం వద్దకు వెళ్లాడు. ఇద్దరు కలిసి స్టాటర్​ను చెక్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొగులయ్య అక్కడికక్కడే మరణించాడు. అతనితో పాటు ఉన్న గాండ్ల సుధాకర్​కు తీవ్రగాయాలు కాగా అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి:షేర్ మార్కెట్ పేరుతో మోసం.. రూ.50కోట్లతో శఠగోపం

Last Updated : Mar 25, 2021, 12:36 PM IST

ABOUT THE AUTHOR

...view details