తెలంగాణ

telangana

ETV Bharat / crime

పేలిన గ్యాస్​ సిలిండర్​.. తప్పిన పెను ప్రమాదం - గ్యాస్​ ప్రమాదాలు

మెదక్​ జిల్లా అల్లీపూర్​ సర్పంచ్​ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా గ్యాస్​ సిలిండర్​ నుంచి మంటలు చెలరేగాయి.

Exploded gas cylinder
పేలిన గ్యాస్​ సిలిండర్​

By

Published : Apr 1, 2021, 5:53 AM IST

మెదక్​ జిల్లా శివ్వంపేట మండలం అల్లీపూర్​లో అగ్ని ప్రమాదం జరిగింది. సర్పంచ్​ పిట్ల సుగుణ ఇంట్లో.. ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు.

ఈ ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. పెను ప్రమాదం తప్పడం వల్ల స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇదీ చదవండి:అడ్డు వస్తున్నాడని పసివాడి ప్రాణాలు తీశాడు

ABOUT THE AUTHOR

...view details