హైదరాబాద్‌లో గోవా నుంచి నిషేధిత మత్తు పదార్థాలు తెచ్చి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. టోలీచౌకీ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా అసలు విషయం బయటపడింది.
గోవా నుంచి తెచ్చారు... హైదరాబాద్‌లో అరెస్టు అయ్యారు... - ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు
గోవా నుంచి నిషేధిత మత్తు పదార్థాలు తెచ్చి విక్రయిస్తున్న ఇద్దరిని హైదరాబాద్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అదే విధంగా నిందితులిచ్చిన సమాచారంతో నగరంలో ఓ ఇంటిపై దాడి చేసి 15 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన వంశీధర్‌రెడ్డి, చిత్తూరు వాసి నల్లపరెడ్డి రఘు కలిసి గోవా నుంచి నిషేధిత మత్తు పదార్ధం అయినా ఎస్‌టెసీ మాత్రలు, ఎల్‌ఎస్‌డీ బ్లోట్స్ కార్లలో రవాణా చేసి తీసుకువస్తున్నారు. టోలీచౌకీ ప్రాంతంలో ఎక్సైజ్ పోలీసులు అనుమానం వచ్చి కారును ఆపి.. తనిఖీలు చేయడంతో అసలు విషయం బయటపడింది. నిందితులిచ్చిన సమాచారం మేరకు కేపీహెచ్‌బీ కాలనీలోని ఓ ఇంటిపై దాడి చేసి 15 లక్షల రూపాయల విలువైన మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఆర్టీసీ ఉద్యోగికి దేహశుద్ధి