Employee Steals Gold From Bank : రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఓ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేసే ఉద్యోగి తన సంస్థకే టోపీ పెట్టాడు. చేతికి వచ్చిన నగదుతో పందేలు కాసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.
అసలేం జరిగిందంటే..
Employee Steals Gold From Bank : రంగారెడ్డి జిల్లా కీసర మండలం నాగారంలో ఓ ఫైనాన్షియల్ సంస్థలో పనిచేసే ఉద్యోగి తన సంస్థకే టోపీ పెట్టాడు. చేతికి వచ్చిన నగదుతో పందేలు కాసి ఉన్నదంతా పోగొట్టుకున్నాడు.
అసలేం జరిగిందంటే..
Employee Steals Gold From Bank in Rangareddy : రంగారెడ్డి జిల్లా నాగారంలోని ఓ ప్రముఖ పైనాన్షియల్ సంస్థ బంగారు ఆభరణాల తాకట్టుతో రుణాలు అందజేస్తుంది. అక్కడ రంజిత్ కుమార్ అనే వ్యక్తి అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. బంగారం భద్రపరిచే గది తాళం చెవి అతడి వద్ద కూడా ఒకటి ఉంటుంది. దాన్ని అవకాశంగా మలచుకొని అక్కడ తాకట్టు పెట్టిన 130కు పైగా ప్యాకెట్లలోని బంగారాన్ని కాజేశాడు.
ఆ బంగారాన్ని మరో ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి సుమారు 4కోట్ల రూపాయలను రుణంగా తీసుకున్నాడు. ఆ డబ్బంతా పందేలు కాసి పోగొట్టుకున్నాడు. మంగళవారం రోజు ఈ విషయం బయటపడటంతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తాకట్టు పెట్టిన బంగారంతో వచ్చిన రుణాన్ని బెట్టింగ్ యాప్‌లో పోగొట్టుకున్నానని నిందితుడు రంజిత్ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు. బంగారు ఆభరణాలను ఒక్కడే తప్పించాడా.. మరెవరైనా సాయం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి:రెచ్చిపోయిన దొంగలు.. రెండు ఇళ్లను ఊడ్చేసి.. మరో ఇంట్లో..!