తెలంగాణ

telangana

ETV Bharat / crime

పొలంలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ను తాకి ఏనుగు మృతి - chittoor latest news

ఏపీలో చిత్తూరు జిల్లాలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. పొలంలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ను తాకడం వల్లే చనిపోయిందని స్థానికులు చెబుతున్నారు. 20 రోజులుగా ఆ ఏనుగు తోటలను, ఫెన్సింగ్​లను ధ్వంసం చేస్తూ.. స్థానికులకు భయాందోళనలకు గురి చేస్తోంది.

elephant
elephant

By

Published : May 22, 2021, 10:48 PM IST

ఏపీలో చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం గోవిందప్పనాయుడు కండ్రిగలో విద్యుదాఘాతంతో ఏనుగు మృతి చెందింది. గ్రామ సమీపంలోని పొలంలో ఉన్న ట్రాన్స్ ఫార్మర్​ను తాకడంతోనే ఏనుగు మరణించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆ ఏనుగు 20 రోజులుగా మండలంలోని కైలాసకోన, తుంబూరు, అరణ్యకండ్రిగ, పాలమంగళంలోని పలు తోటలు, ఫెన్సింగ్​లను ధ్వంసం చేసి ప్రజలను భయాందోళనకు గురి చేసింది.

అప్పటినుంచి ఏనుగును పట్టుకునేందుకు అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా.. ఫలితం కనిపించలేదు. అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఇదీ చదవండి:ఆకలితో అలమటించి వృద్ధ దంపతులు మృతి

ABOUT THE AUTHOR

...view details