ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఉదయం నుంచి హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు - ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తు
ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా దివంగత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు... సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితురాలైన దేవికారాణితో పాటు ఇతర నిందితుల ఇళ్లల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్‌రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు
నాయిని నర్సింహారెడ్డి మాజీ పీఎస్ ముకుందారెడ్డి ఇంట్లో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. కుంభకోణంలో ప్రధాన నిందితురాలైన దేవికారాణితో పాటు ఇతర నిందితుల ఇళ్లల్లోనూ ఈడీ సోదాలు నిర్వహిస్తోంది.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 3 వేలకు చేరువలో రోజువారీ కరోనా కేసులు
Last Updated : Apr 10, 2021, 1:25 PM IST