తెలంగాణ

telangana

ETV Bharat / crime

టవర్​ పైనుంచి దూకేస్తానంటూ మందుబాబు హల్​చల్​.. చివరికి..!

DRUNKER HULCHAL: సికింద్రాబాద్​లో ఓ వ్యక్తి హల్​చల్​ చేశాడు. మద్యం మత్తులో టవర్​ ఎక్కి.. దూకేస్తానంటూ హంగామా సృష్టించాడు. మందుబాబు చేష్టలతో భయభ్రాంతులకు గురైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏం చేశారంటే..?

టవర్​ పైనుంచి దూకేస్తానంటూ మందుబాబు హల్​చల్​.. చివరికి..!
టవర్​ పైనుంచి దూకేస్తానంటూ మందుబాబు హల్​చల్​.. చివరికి..!

By

Published : May 1, 2022, 11:10 AM IST

టవర్​ పైనుంచి దూకేస్తానంటూ మందుబాబు హల్​చల్​.. చివరికి..!

DRUNKER HULCHAL: హైదరాబాద్​ సికింద్రాబాద్​లో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి హంగామా సృష్టించాడు. మద్యం మత్తులో టవర్ ఎక్కి దూకేస్తానంటూ హల్​చల్​ చేశాడు. వివరాల్లోకి వెళితే.. అడ్డగుట్ట ప్రాంతానికి చెందిన నర్సింగ​రావు అనే వ్యక్తి మద్యం మత్తులో.. ఫ్లెక్సీల ఏర్పాటు కోసం ఇస్కాన్ టెంపుల్ సమీపంలో నిర్మించిన టవర్ ఎక్కాడు. రాత్రి 11 గంటల సమయంలో టవర్​ పైనుంచి దూకేస్తానంటూ హల్​చల్​ చేశాడు. నర్సింగ​రావును గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో ఉన్న నర్సింగ​రావును కిందకు దింపేందుకు నానా కష్టాలు పడ్డారు. చివరకు అతి కష్టం మీద సురక్షితంగా కిందకు దింపి.. పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

గతంలోనూ ఇలాగే..: నర్సింగరావు గతంలోనూ రెండుసార్లు ఇలాగే టవర్​ ఎక్కి హల్​చల్​ చేసినట్లు స్థానికులు తెలిపారు. తనకు ఉద్యోగం కావాలని ఓసారి.. భార్య తనను వదిలి పుట్టింటికి వెళ్లిపోయిందంటూ మరోసారి టవర్ ఎక్కి తమను భయభ్రాంతులకు గురి చేసినట్లు వివరించారు.

నిజామాబాద్​లోనూ ఓ యువ రైతు..: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనందిలోనూ ఓ యువ రైతు శనివారం సెల్‌టవర్‌ ఎక్కి ఆందోళన చేశాడు. ప్రత్యామ్నాయ పంటగా పొద్దు తిరుగుడు వేసి నష్టపోయానని.. పరిహారం చెల్లించాలని నిరసన తెలిపాడు. జగదాంబ తండాకు చెందిన బాధవత్ జేతులాల్.. ప్రభుత్వ సూచనల మేరకు 7 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంట సాగు చేశాడు. నకిలీ విత్తనాల పుణ్యమా అని పంట పూర్తిగా నష్టపోయానని.. సర్కారు ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ... టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ ఛైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ బాధితుడితో ఫోన్‌లో మాట్లాడారు. తగిన న్యాయం చేస్తానని చెప్పారు. తహసీల్దార్‌, సీఐలు ఘటనా స్థలానికి చేరుకొని రైతుకు నచ్చచెప్పడంతో కిందికి దిగాడు.

ఇవీ చదవండి..

'కేసీఆర్ మాట విని సన్‌ఫ్లవర్ పంట వేస్తే.. అంతా నష్టమే'

జాబ్​లో చేరిన తర్వాతి రోజే నర్సుకు 'ఉరి'.. ఆస్పత్రిలోనే గ్యాంగ్​రేప్, హత్య!

ABOUT THE AUTHOR

...view details