తెలంగాణ

telangana

ETV Bharat / crime

drunken youth: తప్ప తాగి.. నడిరోడ్డుపై యువకుల వీరంగం - drunken youth

drunken youth: తప్పతాగి.. బైక్​ను నడపడమే తప్పు. అలాంటింది యువకులు తప్పతాగి.. బైక్​ నడుపుతూ ఆర్టీసీ బస్సుకు అడ్డుగా వెళ్లారు. బస్సు డ్రైవర్​ను, కండక్టర్​ను దుర్భాషలాడారు. అనంతరం ప్రయాణికుడిపై ఓ యువకుడు దాడికి దిగాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

drunken youth giving trouble on road at rajanna sircilla
తప్ప తాగి నడిరోడ్డుపై యువకుల వీరంగం

By

Published : Jan 14, 2022, 12:46 PM IST

drunken youth: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని తాడూర్ చౌరస్తా సమీపంలో యువకులు బీభత్సం సృష్టించారు. సిరిసిల్ల, సిద్దిపేట ప్రధాన రహదారిపై యువకులు తప్పతాగి.. ఆర్టీసీ బస్సుకు అడ్డంగా వచ్చారు. అనంతరం డ్రైవర్, కండక్టర్​తో వాగ్వాదానికి దిగారు. అడ్డు వచ్చిన ప్రయాణికుడిపై దాడకి తెగబడ్డారు.

తాడూర్ చౌరస్తా నుంచి రోడ్డు మళ్లింపు కారణంగా.. కొంత దూరం ఒకవైపు మాత్రమే రాకపోకలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తప్పతాగిన యువకులు బైక్​పై ఆర్టీసీ బస్సుకు ఎదురుగా వెళ్లారు. అనంతరం ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ప్రయాణికుడు బస్సు దిగి యువకులను వారించేందుకు యత్నించగా.. మద్యం మత్తులో ఉన్న యువకుడు ప్రయాణికుడిపై దాడి చేశాడు. పిడి గుద్దులు, చెప్పుతో దాడికి తెగబడ్డాడు. దీంతో కొంత సేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వస్తున్నారన్న సమాచారంతో యువకులు అక్కడి నుంచి జారుకున్నారు. దాడికి సంబంధించిన ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఇదీ చూడండి:రోడ్డు డివైడర్​ను ఢీకొన్న కారు- ఏడుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details