జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమలపై వరకట్న వేధింపుల కేసు నమోదైంది. ఆమె కోడలు ఫిర్యాదుతో.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి పోలీసులు ఆఫీసర్ కుటుంబసభ్యులపై కేసు నమోదు చేశారు.
అమ్మాయి పుట్టడంతో..?

పాప పుట్టిన దగ్గర్నుంచి అదనపు కట్నం కోసం అత్త, భర్త తనను మానసికంగా వేధిస్తున్నారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. అదనపు కట్నం కోసం చిత్ర హింసలకు గురి చేస్తున్నారని ఆరోపించింది.
ములకలపల్లికి చెందిన శిరీషకు పాల్వంచకు చెందిన నవీన్‌తో 2018లో వివాహం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఫిర్యాదు నమోదు చేశామని దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:మాట కలిపి.. మాయ చేసి.. ఆపై పోలీసులను..!