తెలంగాణ

telangana

ETV Bharat / crime

చిన్నారులపై శునకాల దాడి.. పదిమందికి గాయాలు

రాయికల్‌ మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వీధిలో ఆడుకుంటున్న చిన్నపిల్లలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.. శునకాల దాడిలో పదిమందికిపైగా చిన్నారులు గాయపడ్డారు.

చిన్నారులపై శునకాల దాడి.. పదిమందికి గాయాలు
చిన్నారులపై శునకాల దాడి.. పదిమందికి గాయాలు

By

Published : Feb 28, 2021, 5:06 AM IST

వీధిలో ఆడుకుంటున్న చిన్న పిల్లలపై శునకాలు దాడి చేసిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్​ మున్సిపాలిటీ పరిధిలో జరిగింది. కుక్కల దాడిలో చిన్నారులతో పాటు పలువురు మహిళలు గాయపడ్డారు. క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. స్వల్పంగా గాయపడిన వారిని రాయికల్‌ ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.

పట్టణంలో రోజురోజుకు కుక్కల బెడద ఎక్కువ అవుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి:మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టిన యూట్యూబ్ ఫేం షణ్ముఖ్

ABOUT THE AUTHOR

...view details