తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం - daughter murdered her mother
16:21 May 12
తల్లిని చంపిన కుమార్తె.. ప్రియుడి సహకారంతో ఘాతుకం
ఏపీలోని విజయనగరం జిల్లా భోగాపురం మండలం సవరవిల్లిలో దారుణం జరిగింది. కన్న తల్లిని.. ప్రియుడితో కలిసి గొంతునులిమి ఓ కుమార్తె హత్య చేసింది. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి లక్ష్మి మృతి చెందింది.
తొలుత అనుమానాస్పద మృతిగా కేసుగా నమోదు చేసిన పోలీసులు.. వైద్యులు అనుమానం వ్యక్తం చేయడంతో కుమార్తె గుట్టురట్టయింది. నిందితురాలు రూప శ్రీ, ప్రియుడు వరుణ్ సాయిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు వివరాలను విజయనగరం డీఎస్పీ అనిల్ వివరించారు.
ఇవీచూడండి:హిడ్మా ఆదేశాలతోనే పేలుడు పదార్థాల రవాణా