చేయడానికి పనిలేక, కుటుంబాన్ని పోషించే మార్గం లేక దినసరి కూలీ బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన రాయిజ్ ఖాన్ కుటుంబం కొన్నేళ్ల క్రితం మహారాష్ట్ర నుంచి వలస వచ్చింది. కూలీ పనులు చేసుకుంటూ భార్య, నలుగురు పిల్లలతో రాయిజ్ జీవనం సాగిస్తున్నాడు.
Suicide: లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి దినసరి కూలీ ఆత్మహత్య - లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి దినసరి కూలీ ఆత్మహత్య
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన దినసరి కూలీ.. కుటుంబాన్ని పోషించుకునే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈ విషాదం చోటుచేసుకుంది.
దినసరి కూలీ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతో రాయిజ్ కొంతకాలంగా సతమతమవుతున్నాడు. దానికి తోడు లాక్డౌన్తో ఉపాధి కోల్పోవడంతో కుటుంబాన్ని పోషించకలేక మదనపడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరిబాబు తెలిపారు.
ఇదీ చదవండి:Lorry Accident: గుడిసెలోకి దూసుకెళ్లిన లారీ.. నలుగురు మృతి