తెలంగాణ

telangana

ETV Bharat / crime

సైబర్​ నేరస్థుల కొత్త బాట.. కార్పొరేట్​ ఆస్పత్రులే లక్ష్యంగా​ దాడులు..

Cyber attacks on Hospitals: ఐటీ సంస్థలు.. ప్రముఖ కంపెనీల మెయిల్స్‌ను హ్యాక్‌చేసి రూ.కోట్లు కొల్లగొడుతున్న సైబర్‌ నేరస్థులు.. ప్రస్తుతం మరో కొత్త దారిని ఎంచుకున్నారు. విదేశాల్లోని ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులు... వైద్యకళాశాలల నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించి డేటాను దొంగిలిస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాల వివరాలను తెలుసుకుని రాన్సమ్‌వేర్‌ దాడులు చేస్తున్నారు.

Cybercriminals attacking on corporate hospitals with ransomware
Cybercriminals attacking on corporate hospitals with ransomware

By

Published : Mar 13, 2022, 5:52 PM IST

సైబర్​ నేరస్థుల కొత్త బాట.. కార్పొరేట్​ ఆస్పత్రులే లక్ష్యంగా​ దాడులు..

Cyber attacks on Hospitals: సైబర్​ నేరస్థులు కొత్త పంథా ఎంచుకున్నారు. ఇన్నాళ్లు.. ఐటీ సంస్థలు, పెద్దపెద్ద కంపెనీలను టార్గెట్​ చేసిన సైబర్​ నేరస్థులు.. ఇప్పుడు తాజాగా ప్రముఖ కార్పొరేట్‌ ఆసుపత్రులు, వైద్యకళాశాలపై పడ్డారు. వాళ్ల నెట్‌వర్క్‌లలోకి ప్రవేశించి.. ఆర్థిక కార్యకలాపాల వివరాలను తెలుసుకుని రాన్సమ్‌వేర్‌ దాడులు చేస్తున్నారు. ఆసుపత్రులల్లో ఒక్క కంప్యూటర్‌ కూడా పనిచేయకుండా నెట్‌వర్క్‌ మొత్తాన్ని గుప్పిట్లో పెట్టుకుంటున్నారు. వాళ్లు డిమాండ్‌ చేసిన సొమ్మును బిట్‌కాయిన్లలో బదిలీ చేస్తేనే.. రాన్సమ్‌వేర్‌లను తొలగిస్తున్నారు.

దేశంలోని మెట్రోనగరాలు, పట్టణాల్లోని కార్పొరేటు ఆసుపత్రులపైన కూడా హ్యాకర్లు దాడి చేసే ప్రమాదముందని తెలుసుకున్న హైదరాబాద్‌ పోలీసులు ఐటీ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని యాజమాన్యాలకు సూచిస్తున్నారు. సామాజిక మాధ్యమాల బృందం ఒక వీడియోను రూపొందించి ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాలలో అప్‌లోడ్‌ చేసింది.

ఆసుపత్రులే ఎందుకు..?

ఆసుపత్రుల వెబ్​సైట్లలో రోగులకు సంబంధించిన సమాచారంతో పాటు మందులు, వాటిని వాడిన తీరు, డ్రగ్స్‌ ఇన్‌పుట్‌ డివైసెస్, ఎమ్మారై, స్కానింగ్‌ వంటివి అంతర్జాలంతో అనుసంధానమై ఉంటాయి. ఆయా ఆసుపత్రులపై రాన్సమ్‌వేర్‌ దాడి చేస్తే.. శస్త్రచికిత్స గదులు, ప్రాణాధార మందుల వినియోగం వంటివి ఎక్కడిక్కడే స్తంభిస్తాయి. దాని వల్ల ఆసుపత్రులకు చాలా నష్టంతో పాటు కీర్తిప్రతిష్ఠలు దెబ్బతింటాయి. అందుకే.. యాజమాన్యాలు వేగంగా స్పందించి నిందితులు కోరిన సొమ్మును ముట్టజెప్తున్నాయి.

హ్యాకర్ల దాడులు ఇలా...

ఆసుపత్రులు వినియోగిస్తున్న ఐపీ చిరునామాలు, ఐటీ పరిజ్ఞానం, సర్వర్లను సైబర్‌ నేరస్థులు తెలుసుకుంటున్నారు. ఆసుపత్రుల్లో వైఫై, హాట్‌స్పాట్‌లు ఎక్కడున్నాయో గుర్తించి వాటిని వినియోగించుకుంటారు. అనంతరం వాటి ద్వారానే నెట్‌వర్క్‌లోకి ప్రవేశించి రాన్సమ్‌వేర్‌ను ప్రయోగిస్తారు.

  • యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా వైద్య కళాశాల, ఆసుపత్రి నెట్‌వర్క్‌లోకి కొద్దినెలల క్రితం హ్యకర్లు ప్రవేశించి సైబర్‌దాడులు చేశారు. 1.14 మిలియన్‌ డాలర్లను డిమాండ్‌ చేయగా.. ఆ మొత్తాన్ని వైద్యకళాశాల యాజమాన్యం చెల్లించింది.
  • హాలీవుడ్‌లోని ప్రెస్‌బెటరేరియన్‌ వైద్య కేంద్రంలో ఐటీ నెట్‌వర్క్‌పై రాన్సమ్‌వేర్‌ ప్రయోగించిన హ్యాకర్లు... 25వేల డాలర్లు డిమాండ్​ చేశారు. చివరకు 17వేల డాలర్లను బిట్‌కాయిన్ల రూపంలో ఇస్తే.. అప్పుడు కార్యకలాపాలు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు.
  • జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ కార్పొరేట్​ ఆసుపత్రి నిర్వహిస్తున్న మందుల దుకాణాల నెట్‌వర్క్‌పై సైబర్‌ నేరస్థులు కొద్దినెలల క్రితం రాన్సమ్‌వేర్‌ ప్రయోగించారు. సదరు ఆసుపత్రి ఐటీ విభాగం వద్ద మరో డేటాబేస్‌ ఉండడంతో ముప్పు తప్పింది.
  • కరోనా చికిత్సలకు ప్రసిద్ధి చెందిన ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల డేటాబేస్‌ వివరాలను తస్కరించేందుకు సైబర్‌ నేరస్థులు కొద్దినెలల క్రితం ప్రయత్నించారు. అంతకుముందు నుంచే పోలీసులకు అనుమానం ఉండడంతో మరో సాఫ్ట్‌వేర్‌లోకి డేటాబేస్‌ను మార్చటంతో.. ఎలాంటి డేటాలాస్​ జరగలేదు.

ముందే సన్నద్ధం కండి..

రాన్సమ్‌వేర్‌ దాడులను ఎదుర్కొనేందుకు.. ముందుగానే నివారించేందుకు హైదరాబాద్‌ పోలీసులు ఆసుపత్రుల యాజమాన్యాలకు "సైబర్‌ సెక్యూరిటీ ఇన్‌ హెల్త్‌కేర్‌ సెక్టార్‌" పేరుతో వీడియో రూపంలో అవగాహన కల్పిస్తున్నారు. వీడియోలో తాము చూపించిన అంశాలను అర్థం చేసుకుని.. తమకు సహకరించాలంటూ సూచిస్తున్నారు. ఐఓటీ గవర్నెన్స్‌ ప్లాన్, వల్నరబులిటీ స్కాన్‌ ప్లాన్, నెట్‌వర్క్‌ ఆర్కిటెక్చర్‌ ప్లాన్‌ను మెరుగుపరుచుకోవాలని వీడియోలో ప్రదర్శించారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details