Kaun Banega Crorepati fraud in Hyderabad: కౌన్‌బనేగా కరోడ్‌పతిలో రూ.1.50 కోట్లు గెలుచుకున్నారంటూ పాతబస్తీవాసి చరవాణికి సందేశం వచ్చింది. అక్కడిచ్చిన వాట్సాప్ నంబరులో మాట్లాడుతూ రెండేళ్లుగా రూ.60 లక్షలు చెల్లించాడు. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా సామాన్యులే కాదు.. సైబర్ మోసగాళ్ల బాధితుల్లో ఐటీనిపుణులు, గృహిణులు, వృద్ధులు ఉంటున్నారు.
కొందరు తెలిసీ ఏమరుపాటులో మోసపోతున్నారు. అధిక శాతం వాట్సాప్/ఫోన్‌కాల్/ఎస్‌ఎంఎస్‌ల ద్వారా స్పందించినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. మోసాల నివారణకు విద్యాసంస్థలు, ఐటీ కంపెనీలు, షాపింగ్‌మాల్స్, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఏయే అంశాల్లో..
*క్రెడిట్/డెబిట్ కార్డులు: పాన్ లింకేజ్, కేవైసీ అప్‌డేట్, కార్డుబ్లాక్, రీప్లేస్‌మెంట్, రివార్డు పాయింట్లు.
*నకిలీ కస్టమర్‌కేర్ సెంటర్లు: గూగుల్, జస్ట్‌డయల్, ఫేస్‌బుక్