తెలంగాణ

telangana

ETV Bharat / crime

నగ్నంగా వీడియో కాల్‌ చేసి.. నట్టేట ముంచేస్తున్నారు

సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త తరహా మోసాలకు తెరతీస్తున్నారు. ఇప్పుడు ఆన్‌లైన్‌లో లైంగికంగా ప్రేరేపించి నిలువునా ముంచేస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటనలు ఇచ్చి.. పలువురిని ఆకట్టుకుంటున్నారు. ఫోన్‌ నంబర్లు సేకరించి.. అవతలి వ్యక్తిని ముగ్గులోకి దింపుతున్నారు. ఆ తర్వాత నగ్న దృశ్యాలు సేకరించి బెదిరింపులకు పాల్పడి డబ్బులు గుంజుతున్నారు.

romance fraud
నగ్నంగా వీడియో కాల్‌ చేసి.. నట్టేట ముంచేస్తున్నారు

By

Published : Mar 31, 2021, 6:11 AM IST

నగ్నంగా వీడియో కాల్‌ చేసి.. నట్టేట ముంచేస్తున్నారు

ఫోన్​ చేసి తీయని స్వరంతో మాట్లాడతారు. మంచి చెడు గురించి ఆరా తీస్తారు. ఆప్యాయత ఒలకబోస్తారు. ఆ తర్వాత ముద్దు ముచ్చట చెప్పి ఆకర్షిస్తారు. వీడియో కాల్ చేసి మాటల్లో దించుతారు. క్రమంగా ఒంటిపై ఒక్కో దుస్తులను తీసేస్తారు. శరీరంపై నూలు పోగు లేకుండా కనిపించి ఎదుటి వ్యక్తిని ప్రేరేపిస్తారు. ఇవతలి వ్యక్తినీ దుస్తులు విప్పేలా చేస్తారు. ఆ దృశ్యాలను రికార్డు చేసి బెదిరింపులకు పాల్పడతారు. చెప్పినంత డబ్బులు ఇవ్వకపోతే సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పెడతామని, స్నేహితులకు పంపిస్తామని బెదిరిస్తారు. ఈ తరహా మోసాలు ఇటీవల ఎక్కువయ్యాయి. డబ్బులు ఇచ్చే కొద్దీ.. మళ్లీ మళ్లీ అడుగుతూ బెదిరింపులకు దిగుతుండడం వల్ల బాధితులు పోలీసులను ఆశ్రయిస్తున్నారు.

రొమాన్స్ ఫ్రాడ్స్..

సైబర్ పరిజ్ఞానం ప్రకారం రొమాన్స్ ఫ్రాడ్స్ పేరుతో పిలిచే ఈ తరహా మోసాలు పలు విధాలుగా జరుగుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో ఫోన్‌ నంబర్లు ఉంచి మోసాలకు పాల్పడుతున్న వాళ్లు కొందరైతే.. గంపగుత్తగా సందేశాలు పంపి.. లైంగిక కోరికలు తీరుస్తామని ఆఫర్లు ఇస్తున్న వాళ్లు మరికొందరు.

నగ్నంగా కనిపించి..

ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల నుంచి వివరాలు సేకరించి.. ఇష్టాయిష్టాలు కనుక్కొని ఆ ప్రకారం మాటల్లోకి దించుతున్నారు. ఆ ఫొటోలను సేకరించి... వాటిని వాట్సాప్‌ డీపీలుగా పెట్టుకొని... స్నేహితుల నంబర్లకు ఫోన్‌ చేస్తున్నారు. తెలిసిన వ్యక్తే కదా అని నమ్మి వీడియో కాల్‌ లిఫ్ట్‌ చేయగానే.. అవతల ఉన్న యువతులు నగ్నంగా కనిపించి... లొంగదీసుకుంటున్నారు.

ఎట్టి పరిస్థితుల్లోనూ..

రొమాన్స్ ఫ్రాడ్స్ బారిన పడుతున్న వాళ్లలో యువకులతో పాటు.. అమ్మాయిలు ఉంటున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఇవీచూడండి:వీడియో కాల్​తో లక్షలు దోచేస్తున్నారు...

ABOUT THE AUTHOR

...view details