తెలంగాణ

telangana

ETV Bharat / crime

క్రెడిట్ కార్డ్ అప్​డేట్ పేరుతో రూ.2 లక్షలు మాయం

సైబర్ నేరగాళ్లను కట్టడి చేయడానికి పోలీసులు రోజుకో టెక్నిక్ ఉపయోగిస్తున్నా.. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా కొందరు అమాయకులు మాత్రం కేటుగాళ్ల చేతిలో బలవుతూనే ఉన్నారు. క్రెడిట్ కార్డ్ అప్​డేట్ చేస్తామని ఓ మహిళను నమ్మించిన సైబర్ క్రిమినల్ ఆమె ఖాతా నుంచి రూ.2 లక్షలు కాజేసిన సంఘటన హైదరాబాద్ బాలానగర్ పరిధిలో జరిగింది.

cyber crime, cyber crime in Hyderabad, cyber crime in telangana
సైబర్ క్రైమ్, హైదరాబాద్​లో సైబర్ క్రైమ్, తెలంగాణలో సైబర్ క్రైమ్

By

Published : May 4, 2021, 10:58 AM IST

హైదరాబాద్ బాలానగర్ పరిధిలో క్రెడిట్ కార్డ్ వివరాలు అప్​డేట్ చేస్తామని ఓ మహిళను నమ్మించిన సైబర్ కేటుగాడు ఆమె ఖాతా నుంచి రూ.2లక్షలు కాజేశాడు. బాలానగర్​కు చెందిన సమీనా ఓ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్​లో ల్యాబ్ టెక్నీషియన్​గా పనిచేస్తోంది. గత నెల 30న క్రెడిట్ కార్డు వివరాలు అప్​డేట్ చేసుకోవాలని కస్టమర్ కేర్ నంబర్​ కోసం గూగుల్​లో సర్చ్ చేసింది. ఓ నెంబర్​కు తన క్రెడిట్ కార్డు అప్​డేట్ చేయాలని రిక్వెస్ట్ పంపింది.

రిక్వెస్ట్ పంపిన అరగంటలో కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ వ్యక్తి సమీనాకు ఫోన్ చేసి తన కార్డు వివరాలు, ఓటీపీ అడిగాడు. వివరాలు చెప్పిన వెంటనే తన ఖాతా నుంచి రూ.2లక్షలు మాయమవ్వడం గమనించిన సమీనా మళ్లీ ఆ నెంబర్​కు ఫోన్ చేసింది. స్విచ్ఛాఫ్ రావడం వల్ల మోసపోయానని గ్రహించి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసుకున్న బాలానగర్ పోలీసులు.. సైబర్ కేటుగాళ్లు రోజుకో పంథాలో మోసాలకు పాల్పడుతున్నారని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ABOUT THE AUTHOR

...view details