leopard attack : వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలంలో చిరుత కదలికలు కలకలం రేపుతున్నాయి. గురువారం రాత్రి కల్మన్ కాల్వ గ్రామంలో ఓ రైతుకు చెందిన ఆవుపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన రైతు మరగోని చెన్నప్ప పొలం ఆటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంది. గురువారం రాత్రి తన పొలంలో ఉన్న ఆవుపై చిరుత దాడి చేసిందని.. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలికి చేరుకున్న అటవీ శాఖ అధికారులు రైతుకు పరిహారం ఇప్పిస్తామని హామీఇచ్చారు.
leopard attack : చిరుత దాడిలో ఆవు మృతి - తెలంగాణ వార్తలు
leopard attack : చిరుత దాడిలో ఆవు మృతి చెందింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం కల్మన్ కాల్వ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. చిరుత కదలికలతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది.
leopard attack
గతంలో కుల్కచర్ల సమీపంలో పలువురి పశువులపై చిరుత దాడి చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. చిరుత దాడిలో మృతి చెందిన పశువులకు సంబంధించి ఇప్పటి వరకు తమకు పరిహారం అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చిరుతను బంధించి అటవీ ప్రాంతంలో దూరంగా విడిచిపెట్టాలని అటవీ శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి:Theft in Kamareddy: పూజకు వెళ్లి వచ్చే లోపు.. డబ్బు, బంగారం దోచేశారు.!