తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎదురుగా వస్తోన్న వాహనాన్ని తప్పించబోయి.. బోల్తాపడిన కారు - ఎయిర్​ బ్యాగ్స్ వార్తలు

కోరుట్లకు చెందిన కాంగ్రెస్​ నేత ప్రయాణిస్తున్న కారు... తిమ్మాపూర్ వద్ద బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. సరైన సమయానికి ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

congress leader car accident at jagtial
బోల్తాపడిన కారు... ఎయిర్​ బ్యాగులే కాపాడాయి

By

Published : Feb 15, 2021, 2:54 PM IST

జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్ వద్ద కారు బోల్తా పడింది. ఈ ఘటనలో కోరుట్లకు చెందిన స్థానిక కాంగ్రెస్ నేతలకు స్వల్ప గాయాలయ్యాయి. కారులో ఎయిర్‌ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది.

ధర్మపురి నుంచి తిమ్మాపూర్ వైపు వెళ్తున్న వాహనం.. ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించే క్రమంలో రోడ్డు కిందకు దూసుకెళ్లి బోల్తా పడింది.

ఇదీ చూడండి:దొంగలను పట్టించిన నిఘానేత్రం... ఏం దొంగలించారో తెలుసా!

ABOUT THE AUTHOR

...view details