Cheetah Dies in Road Accident: మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండల పరిధిలోని తాటికొండ గ్రామ శివారులో గురువారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. చిరుత హైదరాబాద్-బెంగుళూరు 44వ జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. చిరుతపై పెద్దగా గాయాలు లేకపోవడం కొన్ని అనుమానాలకు దారితీసింది.
రోడ్డు ప్రమాదంలో 'చిరుత' మృతి.. - today telangana news
Cheetah Dies in Road Accident: మహబూబ్నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో చిరుత మృతి చెందింది. జాతీయ రహదారిని దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు ఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు ప్రమాదం కారణంగా మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు.
Cheetah Dies in Road Accident
భూత్పూర్ ఎస్సై భాస్కర్ రెడ్డి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకొని పరీశీలించారు. ఈ మేరకు అధికారులు ప్రమాదం కారణంగా మృతి చెందినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్రానికి తరలించారు.
ఇవీ చదవండి: