CBI raids in Nalgonda: నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో పోస్టల్ ఉద్యోగులపై సీబీఐ దాడులు జరిపింది. సుమారు రూ.1.62 కోట్ల అక్రమాలకు పాల్పడిన అభియోగంతో చింతపల్లి మాజీ సబ్ పోస్ట్మాస్టర్ కె.నరేశ్కుమార్పై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.
తక్కల్పల్లి, కుర్మేడ్ బ్రాంచ్ల పోస్టాఫీస్లతో సహా.. పలు బీపీఎంల నుంచి సామాజిక భద్రత పెన్షన్ ఖాతాలకు సంబంధించిన విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో... సీబీఐ దర్యాప్తు చేపట్టింది. పింఛన్లు, ఉపాధిహామీ నిధుల అక్రమాలకు పాల్పడినట్లు తేలింది.