Bus Accident: ప్రైవేటు బస్సు బోల్తా... అందులో 40 మంది ప్రయాణికులు! - ఏపీ తాజా వార్తలు
బాదంపూడి వై-జంక్షన్ వద్ద బస్సు బోల్తా పడింది. మలుపు తిరిగే క్రమంలో బస్సు బోల్తా పడి 20 మందికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. వర్షం కురవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది.
08:17 September 27
Bus Accident
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. బాదంపూడి వై-జంక్షన్ వద్ద మలుపు తిరిగే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
ఈ ఘటనలో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ఉంగుటూరు, తాడేపల్లిగూడేనికి చెందిన అంబులెన్సులు ఘటనాస్థలానికి చేరుకుని... క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించారు. అదే సమయంలో వర్షం కురవడంతో ప్రమాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇదీ చదవండి:Cyclone Gulab Effect on Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం.. స్పెషల్ కంట్రోల్ రూమ్