నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం తుమ్మన్ పేటలో విద్యుత్ షాక్తో వృద్దుడు మరణించాడు. ఏనుగంటి శివయ్య(65) తన గేదెలను మేపడానికి గ్రామ సమీపంలోని రాముల కుంట ప్రాంతానికి వెళ్లాడు.
current shock death: విద్యుత్ షాక్తో గేదె, వృద్ధుడు మృతి
ఓ గేదెకు నీటిని తాగించడానికి వెళ్లిన ఓ వృద్ధుడికి కరెంట్ షాక్ కొట్టి గేదెతో సహా మరణించాడు. ఈ విషాదకర ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది.
గేదెలకు నీరు త్రాగించడానికి కుంటకు వెళుతుండగా బలమైన గాలులు వీచడం వల్ల జారి కింద పడిన కరెంటు తీగలు గేదె కొమ్ములకు తగలడంతో గేదె ప్రమాదానికి గురైంది. గేదెను రక్షించడానికి వృద్దుడు తన చేతిలో ఉన్న కర్రతో విద్యుత్ తీగలను కొట్టడం వల్ల తానకు తీగ తగిలి తానూ కూడా గేదెతోపాటు మృతి చెందాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుని కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
ఇదీ చూడండి:గిరిజన యువతిపై హత్యాచారం.. నిందితుడు అరెస్టు