తెలంగాణ

telangana

ETV Bharat / crime

రోజు వ్యవధిలో అన్నదమ్ముల మృతి.. గుండెపోటుతో తమ్ముడు.. తట్టుకోలేక అన్న - తెలంగాణ తాజా వార్తలు

Brothers Dead in Metpally : తల్లి పేగుబంధం 30 ఏళ్ల క్రితం వారిద్దరిని కలిపింది. తోబుట్టువులు ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా బతికారు. పెళ్లిళ్లు అయినా ఉమ్మడి కుటుంబంలో కలిసి మెలిసి జీవించారు. ఉపాధి కోసం వేరే నగరానికి వెళ్లినా వీలు దొరికినప్పుడల్లా కలుస్తూ ఆప్యాయంగా బతికారు. అయితే గుండెపోటుతో తమ్ముడు తుదిశ్వాస విడిచాడు. దీనిని తట్టుకోలేని అన్న.. తమ్ముడి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగానే ప్రాణాలొదిలాడు. ఒకరోజు వ్యవధిలోనే చేతికందిన ఇద్దరు కుమారులు మృతి చెందడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.

రోజు వ్యవధిలో అన్నదమ్ముల మృతి
రోజు వ్యవధిలో అన్నదమ్ముల మృతి

By

Published : Jan 8, 2023, 9:26 PM IST

Brothers Dead in Metpally : ఒక కుటుంబంలో ఒకరు మరణిస్తే ఆ వియోగం వర్ణణాతీతం. ఏళ్లు గడిచినా ఆ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉంటాయి. అలాంటిది ఒకరోజు వ్యవధిలో ఇద్దరు మృతి చెందితే తట్టుకోవడం కష్టం. ఇక వారు చేతికందిన కుమారులైతే.. ఆ బాధను చెప్పేందుకు మాటలు చాలవు. అలాంటి విషాదమే జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో చోటుచేసుకుంది.

మెట్‌పల్లిలోని రెడ్డి కాలనీకి చెందిన బోగ నాగ భూషణం టెంట్ హౌస్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి ముగ్గురు కుమారులు. శనివారం మధ్యాహ్నం సమయంలో రెండో కుమారుడు 30 ఏళ్ల బోగ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందాడు. శ్రీనివాస్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా పెద్ద కుమారుడు 32 ఏళ్ల బోగ సచిన్ శ్మశాన వాటికలోనే కుప్పకూలిపోయాడు. అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

ఇప్పటికే తమ్ముడు శ్రీనివాస్‌ మృతితో విషాదంలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని అన్న సచిన్‌ మరణం మరింత కుంగదీసింది. వార్త తెలిసినప్పటి నుంచి కుటుంబీకులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. ఒక్కరోజు వ్యవధిలో చేతికందిన ఇద్దరు కుమారులు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో శోకసంద్రంలో కూరుకుపోయారు. తమ్ముడు బోగ శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి ఏడాది వయస్సు దాటిన పాప ఉంది. అన్న సచిన్‌ కోరుట్ల కో-ఆపరేటివ్‌ సొసైటీ బ్యాంకులో ఉద్యోగిగా పని చేస్తున్నాడు. ఇతనికి ఇంకా పిల్లలు కాలేదు.

తమ్ముడి మరణం తట్టుకోలేక అన్న మృతి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details