తెలంగాణ

telangana

ETV Bharat / crime

Brother Killed Sister : చెల్లిని చంపిన అన్న.. కారణం తెలిసి పోలీసులు షాక్ - Brother Killed sister for Chicken curry in AP

Brother Killed Sister in AP : మద్యం మనిషిని మృగంలా మారుస్తుందని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. రాష్ట్రంలో జరిగే నేరాల్లో ఎక్కువ శాతం మద్యం మత్తులో జరుగుతున్నవే ఉన్నాయని పోలీసు గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఇలా మందుతాగి విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి సొంత చెల్లిని కిరాతకంగా హతమార్చాడు. ఈ హత్యకు గల కారణమేంటో తెలిసి.. పోలీసులు కంగుతిన్నారు.

Brother Killed Sister in AP
Brother Killed Sister in AP

By

Published : Mar 5, 2022, 10:19 AM IST

Updated : Mar 5, 2022, 12:34 PM IST

Brother Killed Sister in AP : కోడికూర వండలేదని సొంత అన్నే.. చెల్లిని చంపిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం కన్నాపురంలో చోటుచేసుకుంది. నిందితుణ్ని పట్టుకున్న గ్రామస్థులు చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు నిందితుణ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసుకున్నారు.

అసలేెం జరిగిందంటే..

Brother Killed Sister for Chicken Curry :"కన్నాపురానికి చెందిన కొవ్వాసి నంద కూలీ చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయణ్ను చూసేందుకు తెలంగాణలోని కరకగూడెం మండలం మాదన్నగూడెంలో నివసిస్తున్న చెల్లెలు సోమమ్మ(20) వారం కిందటే కన్నాపురం వచ్చింది. రెండురోజుల్లో వస్తానని నంద భార్య పుట్టింటికి వెళ్లారు. నంద గురువారం రాత్రి పదింటికి మద్యం మత్తులో కోడిమాంసం ఇంటికి తీసుకొచ్చాడు. కోడి కూర చేయమనగా, సోమమ్మ నీరసంగా ఉందని చెప్పడంతో గొడవకు దిగాడు. ఇంటికొచ్చేసరికి వండాలని చెప్పి అతడు బయటకు వెళ్లిపోయాడు. శుక్రవారం తెల్లవారుజామున వచ్చిన నంద కోడికూర వడ్డించాలని కోరగా.. ఆమె వండలేదని చెప్పడంతో దాడికి యత్నించాడు. ఆమె అరుస్తూ బయటకు పరిగెడుతుండగా వెంటాడి గొడ్డలితో నరికాడు. ఆమె కేకలకు చుట్టు పక్కలవారు అక్కడికి చేరుకునే సరికి సోమమ్మ రక్తపుమడుగులో కొట్టుకుంటూ ప్రాణాలొదిలింది. అతణ్ని గ్రామస్థులు చెట్టుకు కట్టేసి మాకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న మా బృందం నిందితుణ్ని అదుపులోకి తీసుకుంది. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం."

- గజేంద్రకుమార్, సీఐ

Last Updated : Mar 5, 2022, 12:34 PM IST

ABOUT THE AUTHOR

...view details