తెలంగాణ

telangana

ETV Bharat / crime

హోలీ వేళ విషాదం.. క్వారీలో బాలుడి గల్లంతు - డీఆర్ఎఫ్ టీమ్

మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్​లో.. హోలీ పండుగ వేళ అపశృతి చోటుచేసుకుంది. మిథిలా నగర్​లోని క్వారీలో ఈతకు వెళ్లిన ఓ బాలుడు నీటిలో గల్లంతయ్యాడు.

boy fell down in a quarry
క్వారీలో బాలుడి గల్లంతు

By

Published : Mar 30, 2021, 9:34 AM IST

హోలీ పండుగ వేళ.. మేడ్చల్ జిల్లా ప్రగతి నగర్​లో విషాదం నెలకొంది. మిథిలా నగర్​లో.. పండుగ సంబురాల్లో రంగులు చల్లుకున్న అనంతరం, ఐదుగురు బాలురు స్నానానికని స్థానిక క్వారీకి వెళ్లారు. పదో తరగతి చదువుతున్న కౌశిక్ శ్రీ సాయి(15) ప్రమాదవశాత్తు నీటిలో గల్లంతయ్యాడు.

తోటివారి సమాచారంతో.. బాధితుడి తల్లిదండ్రులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఆర్ఎఫ్ టీమ్తో​.. క్వారీలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడే సమయానికి బాలుడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో.. కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇవాళ ఉదయం మృతదేహం లభ్యం లభ్యమైంది.

ఇదీ చదవండి:లైవ్​ వీడియో: బైక్​ను తప్పించబోయి లారీలు ఢీ

ABOUT THE AUTHOR

...view details