Blast At Mylardevarapalli : చిత్తు కాగితాలు సేకరిస్తుండగా పేలుడు - రంగారెడ్డి నేర వార్తలు
10:10 February 27
మైలార్‌దేవ్‌పల్లి పరిధిలో పేలుడు
Blast At Mylardevarapalli : చెత్త సేకరిస్తుండగా పేలుడు సంభవించి ఓ మహిళ ఘటనా స్థలిలోనే మృతి చెందింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి పరిధి ఆనందనగర్‌లో జరిగింది. ఆనందనగర్ పారిశ్రామిక వాడలో చెత్త సేకరించేందుకు రంగముని, అతడి భార్య సుశీలమ్మ ఉదయం ఆటోలో వచ్చారు. రోడ్డు పక్కన ఉన్న గ్రానైట్ రాళ్ల పక్కన ఉన్న చెత్తను సేకరిస్తుండగా.. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సుశీలమ్మ ఘటనా స్థలిలోనే మృతి చెందింది.
ఒక్క సారిగా భారీ శబ్దం రావడంతో స్థానికులు వెళ్లి చూడగా.. సుశీలమ్మ మృతి చెంది ఉండగా.. ఆమె భర్త గాయపడ్డాడు. స్థానికులు సమాచారంతో శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని ఘటనపై ఆరా తీశారు.
ఇదీ చూడండి :మానవత్వం మరచిన తల్లి.. దివ్యాంగుడైన కుమారుడిని..!