ఏపీలోని నెల్లూరు జల్లా కోవూరులో భారీ పేలుడు(Blast in kovuru) సంభవించింది. స్థానిక మైదిలి హల్ ప్రాంతంలోని ఒక గదిలో రాత్రి భారీ శబ్దంతో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో కోవూరు ఒక్కసారిగా ఉలిక్కి పడింది. భయంతో జనం పరుగులు తీశారు. స్మశానవాటిక సమీపంలో నిల్వఉంచిన నల్ల మందు పేలిందా, లేక బాంబులు పేలాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో పేలుడు ధాటికి భారీ గుంత పడింది. విద్యుత్ స్తంభం నేలకూలడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Blast at kovuru: కోవూరులో భారీ పేలుడు.. భయంతో జనం పరుగులు
ఏపీలోని నెల్లూరు జిల్లా కోవూరు శ్మశానవాటిక వద్ద భారీ శబ్దంతో పేలుడు(blast at kovuru) సంభవించింది. భయంతో జనం పరుగులు తీశారు. పేలుడు ధాటికి శ్మశానవాటిక సమీప భవనం ధ్వంసమైంది.
Blast at kovuru
నేడు తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు... వరద ప్రాంతాల పర్యటన ఉన్న పరిస్థితుల్లో భారీ పేలుడు(blast in nellore district) అనుమానాలకు దారి తీస్తుంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేస్తున్నారు.
ఇదీ చదవండి:Fire Accident in Siddipet Hospital: ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. భయంతో రోగుల పరుగులు