తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఎలుగుబంటి దాడి..  పశువుల కాపరి పరిస్థితి విషమం - bear attack

అడవిలో తప్పిపోయిన ఆవులను వెతుక్కుంటూ వెళ్లాడు ఆ ఆవుల కాపరి. అకస్మాత్తుగా తనపై ఓ జంతువు దాడి చేసింది. ఏంటా అని చూస్తే ఎలుగు బంటి. దాన్ని చూడగానే గుండె ఆగినంత పనైంది అతనికి. అంతలోనే మీదికి ఎగబడుతూ శరీరాన్ని రక్కేసింది. కనుగుడ్లు పీకేస్తూ ముఖం నిండా గాయాలు చేస్తూ దాడి చేసింది. దాన్ని ప్రతిఘటించలేక ఆ వ్యక్తి చేసిన ఆర్తనాదాలు అంతా ఇంతా కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.

bear attack
ఎలుగుబంటి దాడి

By

Published : Aug 18, 2021, 12:46 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఎలుగుబంటి దాడి గ్రామస్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఎలుగు దాడిలో రుద్రంగి మండలంలోని దేగావత్ తండా చెందిన కున్సోతు గంగాధర్ (50)తీవ్ర గాయాలపాలయ్యారు. గంగాధర్​ ఆవుల మందను కాస్తూ ఉంటారు. మంగళవారం మానాల అడవిలో తప్పిపోయిన ఆవులను వెతికే క్రమంలో అతను ఎలుగుబంటి దాడికి గురయ్యారు. ఘటనలో గంగాధర్​ తల, కళ్లకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర రక్తస్రావమై ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు.

దాడి సమయంలో బాధితుడి అరుపులతో సమీపంలో ఉన్న రైతులు ఘటనాస్థలికి చేరుకుని గంగాధర్​ను రక్షించారు. క్షతగాత్రుడిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇదీ చదవండి:Government hospitals: పేదల ఆస్పత్రుల్లో అధ్వాన పరిస్థితులు.. ఇవిగో సాక్ష్యాలు

ABOUT THE AUTHOR

...view details