తెలంగాణ

telangana

ETV Bharat / crime

Prostitution: 'ఆన్‌లైన్‌’ వ్యభిచారం.. బంగ్లాదేశ్ యువతి రిమాండ్

హైదరాబాద్‌లోని రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశ్ యువతిని సరూర్‌నగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో నగరంలోని ఎల్బీనగర్‌ పరిధిలో పలు చోట్ల ఆమెపై కేసులు నమోదైనట్లు గుర్తించారు. వీసా గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నివసిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం యువతిని రిమాండ్‌కు తరలించారు.

By

Published : Jun 1, 2021, 10:22 PM IST

bangladeshi women
వ్యభిచారం చేస్తున్న బంగ్లాదేశ్ యువతి

‘ఆన్‌లైన్‌ లొకాంటో డేటింగ్‌’ యాప్‌ వ్యభిచారం కేసులో బంగ్లాదేశ్‌ యువతిని సరూర్‌నగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే నిర్వాహకుడు, ప్రొడక్షన్‌ మేనేజర్‌ను రిమాండ్‌కు తరలించారు.

ఇన్‌స్పెక్టర్‌ సీతారాం కథనం ప్రకారం..

బంగ్లాదేశ్‌కు చెందిన ఓ యువతి(34) వనస్థలిపురంలో ఉంటూ.. కొత్తపేటలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివసిస్తోంది. 2014లో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. సులువుగా డబ్బు సంపాదించేందుకు యువతులను తీసుకొచ్చి వ్యభిచారం చేయించింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, ఉప్పల్‌, సరూర్‌నగర్‌ ఠాణాలో ఈమెపై కేసులు నమోదయ్యాయి. పలుమార్లు అరెస్టయింది. గత నెల 18న రాచకొండ కమిషనరేట్‌ మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, సరూర్‌నగర్‌ పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో డెకాయ్‌ ఆపరేషన్‌ చేపట్టగా, దిల్‌సుఖ్‌నగర్‌లో ఆన్‌లైన్‌ యాప్‌ వ్యభిచార నిర్వాహకుడు సహా ఈమె పట్టుబడ్డారు. ఆమెను రెస్క్యూ హోంకు తరలించారు. సోమవారం కస్టడికి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి:Software Prashanth: ప్రేయసి కోసం పాక్​కి వెళ్లి.. నాలుగేళ్ల తర్వాత తిరిగొచ్చి..

ABOUT THE AUTHOR

...view details