మైనర్ బాలికతో వ్యభిచారం (Minor Girl Prostitution) చేయిస్తున్న భార్యభర్తతో పాటు ఓ విటుడిని బాలాపూర్ పోలీసులు (Balapur Police) అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని రాయల్ కాలనీలోని ఓ ఇంట్లో వ్యభిచారం (Prostitution) జరుగుతోందని పోలీసులకు సమాచారం అందింది. ఏహెచ్టీయూ, పోలీసులు సంయుక్తంగా ఆ ఇంటిపై దాడులు నిర్వహించారు.
వ్యభిచార కూపం నుంచి బిహార్ రాష్ట్రానికి చెందిన 17 సంవత్సరాల మైనర్ బాలికకు (minor girl rescued) విముక్తి కలిగించారు. వ్యభిచార ముఠాలోని ముగ్గురు నిర్వాహకుల్లో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. వీరితో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్న బాలాపూర్ పోలీసులు... రిమాండ్‌కు తరలించారు. వారి వద్ద నుంచి రూ.2,420 నగదుతో పాటు మూడు సెల్ఫోన్లు, 6 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
పనిపేరుతో కూపంలో దించి...
బాలాపూర్ రాయల్ కాలనీకి చెందిన రెహానా బేగం, సయ్యద్ అబూబకర్ భార్యభర్తలు. తక్కువ సమయంలో సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో రెహానా బేగం, సయ్యద్ అబూబాకర్ తన స్నేహితురాలు సల్మాబేగంతో కలిసి వ్యభిచారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం చాంద్రాయణగుట్ట నుంచి రాయల్ కాలనీకి రెహానా బేగం మకాం మార్చింది. చాంద్రాయణగుట్టలో ఉంటున్న సమయంలో పక్కింటికి చెందిన 17 సంవత్సరాల బాలిక ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పించాలంటూ రెహానాబేగంను కోరింది.