తెలంగాణ

telangana

ETV Bharat / crime

student Cheated womens: చీటింగ్‌కే కేరాఫ్ అడ్రస్‌.. మోసపోయిన వెయ్యి మంది మహిళలు

student Cheated womens: రాజమండ్రి కుర్రాడు.. బుద్దిగానే చదువుకున్నాడు.. బీటెక్‌ కాగానే హైదరాబాద్‌ వచ్చాడు. ఉద్యోగంలోకి చేరాక.. గుర్రపు పందేలు, క్రికెట్‌ బెట్టింగ్‌లకు బానిసయ్యాడు. దానికోసం అడ్డదారులన్నీ తొక్కాడు. చివరకు మోసాలు చేసేంతగా దిగజారాడు. ఒక్కసారి జైలుకెళ్లాక.. ఓస్‌ ఇంతేనా! అనుకున్నాడు.. క్రిమినల్‌ బుర్రకు పదనుపెట్టి.. చీటింగ్‌కే కేరాఫ్‌ అడ్రస్‌గా మారాడు. ఆరేళ్ల సమయంలో వెయ్యి మంది అమ్మాయిలు, గృహిణులు, వితంతువులను మోసగించి 10 కోట్ల మేర కొట్టేశాడు. సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు నెలల తరబడి కష్టపడి అరెస్ట్‌ చేసి జ్యుడిషియల్‌ రిమాండ్‌కు పంపారు.

student Cheated womens
వంశీకృష్ణ

By

Published : May 11, 2022, 5:05 AM IST

Updated : May 11, 2022, 5:34 AM IST

student Cheated womens: జోగాడ వంశీకృష్ణ, హర్ష, హర్షవర్దన్‌ తదితర మారుపేర్లతో తిరుగుతుంటాడు. ఏపీలోని తూర్పు గోదావరిజిల్లా, రామచంద్రరావుపేట సొంతూరు. రాజమహేంద్రవరంలోని బీటెక్‌ పూర్తిచేసి 2014లో ఉద్యోగ వెతుకులాటలో హైదరాబాద్‌ చేరాడు. రెండేళ్లు కూకట్‌పల్లి వైబ్స్‌ హోటల్‌లో పనిచేశాడు. స్నేహితులతో క్రికెట్, గుర్రపు పందేలు ఆడేవాడు. ఆరేళ్ల క్రితం ట్రావెల్‌-కన్సల్టెన్సీ కార్యాలయంలో ఉద్యోగిగా చేరాడు. అక్కడకు వచ్చిన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ పెద్దఎత్తున డబ్బు వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కూకట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

చీటింగ్‌కే కేరాఫ్ అడ్రస్‌

గాయ‌త్రి, మాధురి, సాత్విక‌, శ్వేత ఇలా చాలా మంది యువతుల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో నకిలీ ఖాతాలు తెరిచాడు. వాటి ద్వారా మహిళలు, యువతులు, బాలికలకు తనను యువతిగా పరిచయం చేసుకొనేవాడు. హర్ష అలియాస్‌ హర్షవర్దన్‌ సంపన్నుడని, సేవా కార్యక్రమాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తాడంటూ అమ్మాయిలే లక్ష్యంగా నకిలీ ఖాతాల నుంచి తన ఫోన్‌ నంబర్లు పంపేవాడు. ఫోన్‌ చేసిన అమ్మాయిలతో తానే హర్ష నంటూ పరిచయం చేసుకునేవాడు. యాప్‌ సహాయంతో గొంతు మార్చి అమ్మాయిగా మాట్లాడేవాడు. కొన్నిసార్లు వాట్సాప్‌ ద్వారా మాట్లాడటం, సందేశాలు పంపేవాడు. యానాం ఎమ్మెల్యే శ్రీనివాస్‌ అశోక్‌ను తానేనంటూ ఆయన ఫొటోతో ఇన్‌స్టా ఖాతా సృష్టించి అందమైన అమ్మాయిలకు వల విసిరాడు. తానే శాసనసభ్యుడినంటూ అవతలి వారితో ఛాటింగ్‌ చేసేవాడు.

చీటింగ్‌కే కేరాఫ్ అడ్రస్‌

ముందు.. యువతుల బ్యాంకు ఖాతాల్లో లక్ష రూపాయలు జమచేసేవాడు. ఒక్కసారిగా పెద్దఎత్తున డబ్బు రావటంతో వారిలో మరింత నమ్మకం పెరిగేది. దీన్ని అవకాశం చేసుకొని తన బ్యాంకు ఖాతాలు నిలిపివేశారని, అత్యవసరంగా డబ్బు కావాలంటూ మహిళల నుంచి క్రికెట్‌ బుకీలు, గుర్రపు పందేల నిర్వాహకుల బ్యాంకు ఖాతాల్లోకి జమచేయించేవాడు. ఆన్‌లైన్‌ వివాహ పరిచయ వేదికల్లో వితంతువులు సహా విడాకులు పొందిన మహిళలను ఎంపిక చేసుకొని పెళ్లి చేసుకుంటానంటూ వారి నుంచి కూడా భారీగా డబ్బు వసూలు చేశాడు. 2016 నుంచి ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా యువతులు, మహిళలు ఇతడి చేతిలో మోసపోయినట్టు తెలుస్తోంది. బాధితుల్లో కేవలం 50-60 మంది మాత్రమే ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

చీటింగ్‌కే కేరాఫ్ అడ్రస్‌

మరో 30 మంది బాధితులు ఏపీ, తెలంగాణల్లో ఉన్నట్టు నిందితుడి వద్ద లభించిన ఆధారాలతో గుర్తించారు. ఆరేళ్ల వ్యవధిలో మాయగాడు సుమారు 5 కోట్ల వరకు సొమ్ము కాజేసి పందేలు కాసినట్టు తెలుస్తోంది. చెన్నై, బెంగ‌ళూరు, ముంబ‌యి, పుణె.. ఇలా క్రికెట్ బెట్టింగ్‌లు, హార్స్ రేసులు ఎక్కడ జ‌రిగితే అక్కడ‌కు వెళ్తాడు. ఎటెళ్లినా విమానంలోనే ప్రయాణం. పోలీసులు కార్లు, రైళ్లలో వెళ్లగానే మ‌నోడు ఎంచ‌క్కా ఫ్లయిట్‌లో జారుకునేవాడు. సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స్టీఫెన్ ర‌వీంద్ర సార‌థ్యంలో ప్రత్యేక బృందాలు 2 నెల‌ల పాటు శ్రమించి వంశీకృష్ణను అరెస్ట్ చేయ‌గ‌లిగారు.

ఇవీ చూడండి:పుడ్డింగ్ పబ్ కేసులో ఒకరికి బెయిల్​.. మరొకరికి నిరాకరణ..

సమస్య పరిష్కరిస్తానంటూ మహిళపై పోలీస్ అత్యాచారం

Last Updated : May 11, 2022, 5:34 AM IST

ABOUT THE AUTHOR

...view details