ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటన సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం బిక్కుమల్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆటో బోల్తా.. ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు - suryapet district latest news
సూర్యాపేట జిల్లాలో ఆటో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నూతనకల్ మండలం యర్రబాడు గ్రామానికి చెందిన మహిళా కూలీలు సోమవారం కూలీ పనులకు వెళ్లారు. తిరిగి వస్తున్న క్రమంలో బిక్కుమల్ల గ్రామం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఇరుగు లింగమ్మ అనే (40) మహిళ కూలీ అక్కడిక్కడే మృతి చెందింది. మరో ఐదుగురు మహిళా కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు.
ఇదీ చదవండి:తప్పనిసరి అయితేనే బ్యాంకుకు రావాలి: ఎస్‌బీఐ