నవ దంపతులను కిడ్నాప్ చేసేందుకు యత్నం - jagtial crime news
12:03 March 05
నవ దంపతులను కిడ్నాప్ చేసేందుకు యత్నం
కులాంతర వివాహం చేసుకున్న నవ దంపతులను కిడ్నాప్ చేసేందుకు యువతి బంధువులు యత్నించిన సంఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం గోవిందారంలో చోటుచేసుకుంది. యువకుడి బంధువుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ జంటను రక్షించారు.
రామన్నపేటకు చెందిన యువతిని రాంపూర్‌కు చెందిన యువకుడు కులాంతర వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఈ నవదంపతులు గోవిందారంలోని బంధువుల ఇంట్లో తలదాచుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. ఈ జంటను కార్లలో తీసుకెళ్లేందుకు యత్నించగా.. యువకుడి తరఫు బంధువులు అడ్డుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
రంగంలోకి దిగిన పోలీసులు.. యువతి తరఫు బంధువులను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురిపై కిడ్నాప్, హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ నవజంట పోలీసుల సంరక్షణలో ఉంది.
- ఇదీ చూడండి :ఆర్మీ జవాన్ మృతి.. వెల్లడి కాని కారణాలు