కార్లు పరస్పరం ఢీకొన్న ఘటనలో వివాదం చెలరేగి నవీన్ అనే వ్యక్తి పాండు అనే వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో జరిగింది.
వ్యక్తిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం
చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాలమీదకు తెచ్చింది. కార్లు పరస్పరం స్వల్పంగా ఢీ కొనడంతో జరిగిన ఘర్షణ కత్తితో దాడి చేసుకునేదాకా వెళ్లింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగింది.
జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవీన్, పాండు కార్లు శనివారం మధ్యాహ్నం స్వల్పంగా ఢీ కొన్నాయి. ఈ విషయమై ఇరువురు గొడవపడ్డారు. స్థానికులు సర్ది చెప్పడంతో అప్పటికి శాంతించి ఇళ్లకు వెళ్లిపోయారు. సాయంత్రం నవీన్ మద్యం సేవించి పాండు ఇంటికి వెళ్లి మళ్లీ గొడవకు దిగాడు. చేతిలో ఉన్న కత్తితో పాండుపై దాడి చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. తీవ్రగాయాలపాలైన బాధితున్ని కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి:రైల్వే బ్రిడ్జిపై కారు, లారీ ఢీ.. ఒకరికి స్వల్పగాయాలు