Attack on Marredpally SI : హైదరాబాద్‌లో పోలీసులపై దుండగులు దాడులకు పాల్పడుతున్నారు. వారం క్రితం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్‌పై జరిగిన దాడి మరవకముందే.. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. మారేడుపల్లి ఎస్సై వినయ్‌కుమార్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు కత్తితో దాడిచేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరిని ఎస్సై ప్రశ్నించారు. ఈ క్రమంలోనే దుండగులు చిన్న కత్తితో ఎస్సై కడుపులో పొడిచి పరారయ్యారు.
Attack on Marredpally SI : మారేడ్‌పల్లి ఎస్సైపై కత్తితో దుండగుల దాడి - Attack on Marredpally SI Vinay kumar in Hyderabad
Attack on Marredpally SI : రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులపై దుండగులు దాడులు ఎక్కువయ్యాయి. ఇటీవల సంగారెడ్డిలో పోలీసులపై జరిగిన దాడి మరవకముందే మంగళవారం అర్ధరాత్రి విధుల్లో ఉన్న ఓ ఎస్సైని దుండగుడు కత్తితో పొడిచి పరారయ్యాడు. తోటి అధికారులు అతణ్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
Attack on Marredpally SI
గాయాలపాలైన ఎస్సై వినయ్‌కుమార్‌ను పోలీసులు గీతా నర్సింగ్ హోంకు తరలించారు. ప్రస్తుతం ఎస్సై ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కాగా ఎస్సైపై దాడికి పాల్పడిన దుండగులను పోలీసులు గుర్తించారు. లంగర్‌హౌస్‌కు చెందిన పవన్, బాలాజీనగర్‌కు చెందిన సంజయ్‌గా తేల్చారు. వీరు గతంలో పలు దొంగతనం కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం నిందితులిద్దరూ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.
Last Updated : Aug 3, 2022, 2:01 PM IST
TAGGED:
Attack on Marredpally SI