గుట్టు చప్పుడు కాకుండా బ్లాక్ ఫంగస్ బాధితులను లక్ష్యంగా చేసుకుని అధిక ధరలకు ఇంజక్షన్లను విక్రయిస్తున్న అన్నాతమ్ముళ్లను ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. యూసుఫ్‌గూడకు చెందిన బోయపాటి బాలు ఓ యూట్యూబ్ ఛానల్‌లో పాత్రికేయుడుగా పని చేస్తున్నాడు. ఇతని సోదరుడు బోయపాటి యోగానంద్... విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీపక్ గుప్తాతో కలిసి యాంపొటెరిసిన్-బి ఇంజక్షన్‌ను అక్రమంగా అమ్ముతున్నాడు.
Black fungus : అక్రమంగా ఇంజక్షన్లు విక్రయినస్తున్న సోదరుల అరెస్ట్ - latest crime news in hyderabad
బ్లాక్ ఫంగస్ బాధితులను లక్ష్యంగా చేసుకొని అక్రమంగా యాంపొటెరిసిన్-బి ఇంజక్షన్లను అధిక ధరలకు విక్రయిస్తున్న సోదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
బాలు, యోగానంద్, దీపక్‌లు అధిక ధరలకు ఇంజక్షన్లను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద సదరు ఇంజక్షన్లను అమ్మేందుకు బాలు, యోగానంద్ వచ్చారు. పక్కా సమాచారంతో ఎస్‌ఓటీ, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించి వీరిని పట్టుకున్నారు. అనంతరం వారి నుంచి ఐదు ఇంజక్షన్లు, ద్విచక్రవాహనం, రెండు చరవాణిలు స్వాధీనం చేసుకొని అన్నాతమ్ముళ్లను అరెస్ట్ చేశారు. దీపక్ గుప్త పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి :Diagnostics: కరోనా నిర్ధారణ పరీక్షకు వెళ్తే నిలువు దోపిడీ